Gold Price Today: బంగారం కొనేవారికి గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today: బంగారం కొనేవారికి గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
Gold Price Today

Gold Silver Price Today: బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త. గత రెండు రోజులుగా బులియన్ మార్కెట్‌ ఆకాశన్నంటిన పసిడి ధరలు శుక్రవారం (ఏప్రిల్‌ 7) కాస్త దిగొచ్చాయి. శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55, 900లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 60,980 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.350, 24 క్యారెట్ల బంగారంపై రూ. 380 మేర తగ్గింది. ఇక కిలో వెండి ధర కూడా రూ.600 మేర తగ్గి రూ.76,490 వద్ద కొనసాగుతోంది. మరి మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55, 950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,980 గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55, 950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,980 పలుకుతోంది.
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55, 950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,980 లుగా కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,050 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,130గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,950 పలుకుతోంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640కు లభిస్తోంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,980
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,030కు లభిస్తోంది.

వెండి ధరలిలా..

  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,490 లుగా ఉంది.
  • ముంబైలో కిలో వెండి ధర రూ.76,490
  • చెన్నైలో కిలో వెండి ధర రూ.80,000
  • బెంగళూరులో రూ.80,000
  • కేరళలో రూ.80,000
  • కోల్‌కతాలో రూ.76,490
  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,000
  • విజయవాడలో రూ.80,000
  • విశాఖపట్నంలో రూ.80,000 లు పలుకుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/t267l9y

Baca juga

Post a Comment