IPL 2023: రోహిత్ సేనపై రహానే ‘ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ’.. చెన్నై ఖాతాలోకి రెండో విజయం..

IPL 2023: రోహిత్ సేనపై రహానే ‘ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ’.. చెన్నై ఖాతాలోకి రెండో విజయం..
Mi Vs Csk

IPL 2023, MI vs CSK: తొలి మ్యాచ్‌లో బెంగళూరు చేతుల్లో ఓడిన ముంబై ఇండియన్స్, ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్‌పై కూడా ఓటమిపాలైంది. దీంతో ఐపీఎల్ సీజన్ 16లో ముంబై తన రెండు మ్యాచ్‌లను చేజార్చుకున్నట్లయింది. హోమ్ గ్రౌండ్ అయితే వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై 7 వికట్ల తేడాతో చెన్నైపై ఓడింది. ఈ క్రమంలో చెన్నై తరఫున కేవలం 27 బంతుల్లోనే 61 పరుగుల చేసి ఐపీఎల్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని సొంతం చేసుకున్నాడు. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేశారు. ముంబై తరఫున బ్యాటింగ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభాన్ని అందించారు. కేవలం 23 బంతుల్లోనే 38 పరుగులు భాగస్వామ్యాన్ని కొల్పోయారు. కానీ తుషార్ దేశ్‌పాండే వేసిన నాలుగో ఒవర్ చివరి బంతికి రోహిత్(21) క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్ బాట పట్టాడు.

ఆ తర్వాత నిలకడగా ఆడుతున్న ఇషాన్ కూడా జడేజా బౌలింగ్‌లో ప్రెటోరియస్‌కి క్యాచ్ ఇచ్చుకుని మైదానం విడిచిపట్టాడు. అనంతరం వచ్చిన తిలక్ వర్మ(22), టిమ్ డేవిడ్(31) మినహా మిగిలినవారెవరు నిలకడగా రాణించలేకపోయారు.  ఇక చెన్నై తరఫున జడేజా 3 వికట్లు తీసుకోగా, శాంట్నర్, దేశ్ పాండే చెరో 2, సిసండా మగల ఒక వికట్ పడగొట్టాడు. ముంబై ఇన్నింగ్స్ ముగియడంతో 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది చెన్నై. అయితే రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి క్రీజులోకి వచ్చిన డేవిడ్ కాన్వే డక్‌ ఔటయ్యి, ధోని సేనకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలేలా చేశాడు. కానీ అనంతరం వచ్చిన అజింక్యా రహానే.. గైక్వాడ్‌తో కలిసి నిలకడగా రాణించాడు. ఈ క్రమంలో అతను 20 బంతుల్లోనే 50 పరుగులు మార్క్‌ని కూడా దాటాడు. దీంతో తన టీమ్‌మేట్ మొయిన్ ఆలీ పేరిట ఉన్న రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సమం చేశాడు.

అయితే చావ్లా వేసిన 8వ ఓవర్ చివరి బంతిని ఆడిన రహానే(61) ఔట్ అయ్యాడు. అతను కొట్టిన బంతిని సూర్య కుమార్ యాదవ్ క్యాచ్ పట్టడంతో రహానే పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత గైక్వాడ్‌తో కలిసిన శివమ్ దుబే(28) కూడా కాసేపు నిలకడగానే రాణించి, కుమార్ కార్తికేయ బౌలింగ్‌లో వికెట్ కోల్పోయాడు. దుబే ఔట్ అవ్వడంతో క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు కేవలం 16 బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. మరోవైపు గైక్వాడ్(40 నాట్ ఔట్) కూడా అతనికి తోడు ఉండడంతో చెన్నై టీమ్ విజయం ఖరారైంది. ఇక ముంబై తరఫున అర్షద్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టి చెన్నైని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. అలాగే కామెరూన్ గ్రీన్, బెహ్రండర్ఫ్ చెరో వికెట్ తీసుకున్నారు. అయితే మ్యాచ్ విజయం చెన్నై సొంతం కావడంతో టా టీమ్ ఖాతాలో ఇది రెండో గెలుపు కాగా, అలాగే ముంబైకి ఇది 2వ ఓటమి.

 



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/GyHI6qd

Baca juga

Post a Comment