Jupiter Transit: మేషరాశిలోకి ప్రవేశించబోతున్న బృహస్పతి.. ఈ రాశులకు సంతానప్రాప్తితో పాటు దశ తిరిగినట్లే..

Jupiter Transit: మేషరాశిలోకి ప్రవేశించబోతున్న బృహస్పతి.. ఈ రాశులకు సంతానప్రాప్తితో పాటు దశ తిరిగినట్లే..
Jupiter Transit

సనాతన ధర్మంలో భాగమైన జ్యోతిష్యశాస్త్రంలో బృహస్పతిని దేవగురు, దేవతలకు గురువుగా పరిగణిస్తారు. అదృష్టం, సంతానానికి కారకుడైన గురుడు ఈనెల 27న మేషరాశిలో ప్రవేశించనున్నాడు. అయితే జ్యోతిష్యశాస్త్రంలో బృహస్పతి సంచారాన్ని శుభప్రదంగా భావిస్తారు. అంతే కాక గ్రహాల సంచారం మానవ జీవితంలో ఎన్నో మార్పడలను తీసుకువస్తుంది.  ఈక్రమంలోనే మేషరాశిలోకి గురుగ్రహ ప్రవేశం కూడా కొన్ని రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది.  ఈ క్రమంలో మేషరాశిలో గురు సంచారం ఏయే రాశులకు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

మేషరాశిలో దేవగురు సంచారం ఈ 4 రాశులకు చాలా మంచిది..

బృహస్పతి ఉదయం ఈ రాశులకు వరం

మేషరాశి: బృహస్పతి ఈ 27న మేషరాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో ఈ రాశివారికి ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. జాబ్ చేసే వారికి ప్రమోషన్, ఉద్యోగం కోసం ఎదురుచూసేవారు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో మేషరాశివారికి అంతాశుభ వార్తలే వినిపిస్తాయి. ఈ సమయంలో వీరికి సంతాన ప్రాప్తి కలిగే అవకాశం కూడా ఉంది.

మిథునరాశి: మిథునరాశి వారికి కూడా గురు గ్రహ సంచారం ప్రయోజనకరం. ఈ సమయంలో వీరు భారీగా డబ్బును సంపాదిస్తారు. కెరీర్‌లో కూడా కొత్త అవకాశాలను అందిపుచ్చుకుని.. ప్రతి పనిలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు.

తులారాశి: తులారాశి వారికి మేషరాశిలో బృహస్పతి సంచారం అనుకూల ఫలితాలను అందిస్తుంది. వీరు ఈ సమయంలో అనేక విజయాలను, వ్యాపారలాభాలను మెండుగా పొందుతారు. వైవాహిక జీవితంలో సమస్యలకు అన్నీ దూరమవుతాయి.

సింహరాశి: బృహస్పతి మేషరాశిలో సంచరించడం వల్ల సింహ రాశి వారి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు ఆర్థికప్రయోజనం పొందుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/8uQtmAH

Baca juga

Post a Comment