Andhra Pradesh: మూడేళ్లుగా పెరిగిన రెగ్యులర్ ఉద్యోగాలు.. మళ్ళీ వాలంటీర్లను నియమించాలని సీఎంని కోరిన పలు ఉద్యోగ సంఘాలు..


టీడీపీ హయాంలో తొలగించిన 500 మంది మండల సమన్వయకర్తలకు స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌లో అవకాశం కల్పించటంపై హర్షం వ్యక్తం చేశారు ఏపీలోని పలు ఉద్యోగ సంఘాల నేతలు. ఇక కొన్ని సంఘాలు ఉద్యోగులతో కలసి చేస్తోన్న ఆందోళన ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఉద్యోగ సంఘాలు చేస్తోన్న పోరాటం వారికోసం చేస్తున్నది తప్ప ఉద్యోగుల కోసం కాదన్నారు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి.
సీఎం వైఎస్ జగన్‌ను సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కలిశారు. ఆయనతో పాటు సీఎంను సాక్షర భారత్, రెవెన్యూ, సర్వే ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. సాక్షర భారత్ కింద పని చేస్తోన్న 500 మంది మండల కో ఆర్డినేటర్లను.. సాక్షర భారత్ లో 20 వేల మంది గ్రామ కో ఆర్డినేటర్లను గత ప్రభుత్వం తొలగించిందన్నారు వెంకట్రామిరెడ్డి. అంతేకాకుండా.. తొలగించిన మండల కో- ఆర్డినేటర్లను స్వచ్చాంధ్ర కార్పోరేషన్ లో ఉద్యోగులుగా సీఎం జగన్ నియమించారని, అలాంగే తొలగించిన 20వేల మంది గ్రామ కో ఆర్డినేటర్లలో 5 వేల మంది ని తిరిగి వాలంటీర్లుగా సీఎం నియమించారన్నారు. ఇంటర్ విద్యార్హత కల్గిన 5 వేల గ్రామ కో ఆర్డినేటర్లను వాలంటీర్లుగా సీఎం నియమించారని వెల్లడించారు.
గత ప్రభుత్వం తొలగించిన ఆయుష్ సిబ్బందికి న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారని, వీటికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు వస్తాయన్నారు వెంకట్రామిరెడ్డి. గత ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగాలే 60వేలు తగ్గాయని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూడేళ్లలో లక్ష రెగ్యులర్ ఉద్యోగాలు పెరిగాయన్నారు. ఉద్యోగులకు న్యాయం చేస్తోన్న సీఎం జగన్‌కు వెంకట్రామిరెడ్డి కృతజ్ణతలు తెలిపారు. వీఆర్ఎ లకు గతంలో నుంచి ఇస్తోన్న 300 రూపాయల డీఎ రికవరీ చేయాలన్న ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని సీఎంను కోరామని, వీఆర్వో ల పదోన్నతుల్లో ఎక్కువ మందికి లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరామన్నారు. ఇక కొన్ని సంఘాలు ఉద్యోగులతో కలసి చేస్తోన్న ఆందోళనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఉద్యోగ సంఘాలు చేస్తోన్న పోరాటం వారికోసం చేస్తున్నది తప్ప ఉద్యోగుల కోసం కాదన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/SfW5UHz
Post a Comment
Post a Comment