Delhi BRS Office: దేశ రాజధానిలో గులాబీ సౌధం.. ఇవాళ బీఆర్‌ఎస్ ఆఫీస్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్


దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఉండాలని.. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటాయి. కానీ ఇప్పటి వరకు చాలా పార్టీలకు సొంత భవనాలు లేవు. బీఆర్‌ఎస్ పార్టీ మాత్రం అద్భుతమైన భవనాన్ని నిర్మించుకుంది. భవిష్యత్ అవసరాలు, పార్టీ కార్యకలాపాలకు అనుగుణంగా కట్టిన ఆ బిల్డింగ్‌ను ఇవాళ ప్రారంభించబోతున్నారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం ఒంటిగంటా 5 నిముషాలకు ఢిల్లీలోని బీఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తారు. మధ్యాహ్నం 12:30కి వసంత్ విహార్‌లోని బీఆర్ఎస్ ఆఫీసుకు సీఎం చేరుకుంటారు. హోమం, యాగం, వాస్తు పూజల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు సీఎం కేసీఆర్.
2021 సెప్టెంబర్‌లో భవనానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అత్యంత వేగంగా నిర్మాణం పూర్తైంది. నాలుగు అంతస్తులతో ఉంటుందీ బిల్డింగ్. లోయర్ గ్రౌండ్‌లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల ఛాంబర్లు ఏర్పాటు చేశారు. ఇక మొదటి అంతస్తులో బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుని ఛాంబర్, ఇతర ఛాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి. 2, 3వ అంతస్తుల్లో మొత్తం 20 రూములు నిర్మించారు. వీటిలో ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్ పోగా.. మిగతా 18 ఇతర రూములు పార్టీ నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాయి.
ఇది భవనం కాదు.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అన్నారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమలో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా 200 మంది ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మంత్రి ప్రశాంత్‌రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ పార్టీ పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. దీనిలో భాగంగా ఢిల్లీలో ఆఫీస్ ను ప్రారంభిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/rydF06M
Post a Comment
Post a Comment