Watch Video: తింగరోడి తిక్క కుదిర్చిన ధీశాలి.. సైలెంట్‌గా కూర్చున్న ఆమెను అక్కడ టచ్ చేశాడు.. ఆ తరువాత కత నెక్ట్స్ లెవల్..

Watch Video: తింగరోడి తిక్క కుదిర్చిన ధీశాలి.. సైలెంట్‌గా కూర్చున్న ఆమెను అక్కడ టచ్ చేశాడు.. ఆ తరువాత కత నెక్ట్స్ లెవల్..
Woman Kicks Man

కొందరు కంత్రీగాళ్లు ఉంటారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా మహిళలను వేధింపులకు గురి చేస్తారు. ఆడవాళ్లను అసభ్యంగా తాకడం, వేధించడం చేస్తుంటారు. ఆ ఆకతాయిల అల్లరిని భయంతో కొందరు లైట్ తీసుకుంటే.. మరికొందరు ధైర్యంగా ఎదురు తిరిగి నిలదీస్తారు. ఇంకొందరైతే.. శివాలెత్తిపోయి ఏకంగా వీరబాదుడు బాదేస్తారు. తాజాగా అచ్చం ఈ కోవకే చెందిన మహిళకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె కొట్టిన దెబ్బలు చూస్తే అబ్బరబిడ్డ.. వాడు ఉన్నాడా? పోయాడా? అని అనిపించక మానదు.

ఇంతకీ అతనేం చేశాడు? ఆమె ఎందుకు కొట్టింది? అసలేం జరిగింది? వివరాలు ఇప్పుడు చూద్దాం. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ బేకరీలో మహిళ కూర్చుని ఫోన్ ఆపరేట్ చేస్తుంది. ఇంతలో ఓ యువకుడు వచ్చి ఆమె నడుమును టచ్ చేశాడు. ఇంకేముంది.. అగ్గిబరాటాలా రగిలిపోయింది. ఒక్క ఉదుటున లేచి, అతన్ని పట్టుకుని పిడిగుద్దులు గుద్దింది. కింద పడేసి, తన్నుతూ, పంచ్‌లు ఇచ్చింది. కొందరు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. అస్సలు తగ్గలేదు. చివరకు ఆమె దెబ్బలకు తాళలేక.. ఆ యువకుడు బతుకు జీవుడా అంటూ పరుగులు తీశాడు.

ఈ ఘటన అంతా బేకరీలోని సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వగా.. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్ అయ్యింది. కంత్రీగాడి తిక్క కుదిర్చిన వీరనారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/23bn10f

Baca juga

Post a Comment