Mahesh Babu: మొదటిసారి స్టేజ్ పైనే స్టెప్పులేసిన మహేష్.. సర్కారు వారి పాట మాస్ సెలబ్రెషన్స్‌లో సూపర్ స్టార్..

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ (Parasuram ).. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబోలో వచ్చిన సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. విడుదలైన ఐదు రోజుల్లోనే దాదాపు రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది.. ఓవైపు బాక్సాఫీస్ వద్ద సర్కారు వారి పాట హావా కొనసాగుతుండగానే.. మరోవైపు ఈ మూవీ సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. కళావతి…. పెన్నీ సాంగ్స్ మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుండగా.. మ.. మ.. మాహేష సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సర్కారు వారి పాట సెన్సెషన్ హిట్ కావడంతో సోమవారం కర్నూలులో సక్సెస్ సెలబ్రెషన్స్ నిర్వహించింది చిత్రయూనిట్. అయితే ఈ వేదికపై మహేష్ బాబు ఫుల్ ఎనర్జీతో స్టెప్పులేశారు..
సర్కారు వారి పాట సక్సెస్ సెలబ్రెషన్స్‌కు అంచనాలకు మించి ఫ్యాన్స్ హాజరు కావడంతో కర్నూల్లో జనసందోహం ఏర్పడింది. స్టేజ్ మీద మ మ మహేషా పాటకు తమన్ డ్యాన్స్ చేస్తుండగా.. కింది నుంచి మహేష్ ఆకస్మాత్తుగా వచ్చి స్టె్ప్పులేశారు. ఒక్కసారిగా మహేష్ అలా డ్యాన్స్ చేయడంతో అక్కడున్న అభిమానులంతా షాక్ అయ్యారు. మొదటి సారి మహేష్ బాబు ఇలా సక్సెస్ సెలబ్రెషన్స్‌లో స్టేజ్ మీద స్టెప్పులేశారు. దీంతో అభిమానులు సైతం ఫుల్ ఖుషి అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది.
from TV9 Telugu- Telugu News, Telugu Samachar https://ift.tt/cPaheT7
Related Posts
- Pearl Farming: ముత్యాల సాగుని ప్రోత్సహిస్తోన్న ప్రభుత్వం.. అక్కడ ముత్యాలను పండించే రైతులకు భారీగా సబ్సిడీ..
- Hyderabad: పార్కింగ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్‌లో మంటలు.. క్షణాల్లోనే దగ్ధమైన వైనం..
- Viral: వామ్మో..! ఈ బుజ్జి తల్లి పిల్లి పిల్ల అనుకుని ఇంటికి ఏం తెచ్చిందో తెలిస్తే షాకే..
- Gastroenteritis: అక్కడ భారీగా పెరుగుతోన్న గ్యాస్ట్రో ఎంటెరిటిస్ కేసులు.. బాధితులతో నిండిపోతున్న ఆస్పత్రులు.. కారణమేంటంటే..
- Horoscope Today: వీరు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
- RR vs DC, IPL 2022: దంచికొట్టిన మార్ష్, వార్నర్.. RRపై ఢిల్లీ సూపర్ విక్టరీ.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం..
Post a Comment
Post a Comment