Badruddin Ajmal: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ముస్లింలను “టార్గెట్” చేస్తున్నాయి

Badruddin Ajmal

బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా బంగ్లా టీమ్ (ABT)తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై అస్సాంలోని బొంగైగావ్ జిల్లాలో ఒక ప్రైవేట్ మదర్సాను బుధవారం కూల్చివేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఆగస్టు నెలలో కూల్చివేయబడిన మూడో ప్రైవేట్ మదర్సా ఇది.

మదర్సా ఉపాధ్యాయుడు హఫీజుర్ రెహమాన్‌ను ఆగస్టు 26న అరెస్టు చేసిన కొద్ది రోజులకే మళ్లీ మదర్సాను కూల్చివేశారు. ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఆగస్టు 21న సమీపంలో ఉన్న గోల్‌పరా జిల్లాలో పట్టుబడిన ఇద్దరు ఇమామ్‌లు అందించిన సమాచారం ఆధారంగా రెహ్మాన్‌ను అరెస్టు చేశారు. అయితే, ఇమామ్‌లు స్థానిక నివాసితులు, రాష్ట్రం వెలుపల నుండి వచ్చినవారు కాదని పోలీసులు ఇంతకు ముందు తెలిపిన విషయం తెలిసిందే.

మంగళవారం జరిగిన దాడిలో జిహాదీ గ్రూపులతో సంబంధాలను సూచించే నేరారోపణ పత్రాలు రికవరీ చేయడంతో బుధవారం ఉదయం బొంగైగావ్‌లోని కబైతరీ వద్ద ఉన్న మదర్సాను కూల్చివేసే ప్రక్రియను ప్రారంభించామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) స్వప్ననీల్ దేకా తెలిపారు. మంగళవారం కూల్చివేతకు సంబంధించి నోటీసు జారీ చేయబడిందని, దాదాపు 200 మంది మదర్సా విద్యార్థులను ఇంటికి తిరిగి పంపామని, సమీపంలోని ఇతర సంస్థలకు మార్చామని వివరించారు. అంతేకాకుండా, అవసరమైన నిబంధనలు, అనుమతులు పాటించకుండా ప్రైవేట్ భూమిలో మదర్సా నిర్మించబడింది. అందుకే విపత్తు నిర్వహణ చట్టంలోని నిబంధనల ప్రకారం కూల్చివేసినట్లు ఎస్పీ తెలిపారు.

అయితే.. బార్‌పేట జిల్లాలోని ఓ ప్రైవేట్ మదర్సాను అధికారులు ధ్వంసం చేశారు. అదేవిధంగా, మోరిగావ్ జిల్లాలో మరో ప్రైవేట్ సంస్థను ఆగస్టు 4న తొలగించారు. AQIS , ABT సభ్యులు జిహాదీ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణల మధ్య రెండు సంస్థలను కూల్చివేశారు. దీనిపై స్పందించిన ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) చీఫ్, లోక్‌సభ ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. మదర్సాలపై కూల్చివేత కార్యక్రమం కొనసాగితే తమ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో మదర్సాలపై అస్సాం ప్రభుత్వం బుల్డోజర్ డ్రైవ్ చేయడాన్ని అంగీకరించలేమన్నారు. దానిని ఆపాలని, అవసరమైతే, దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వెళ్తామని చెప్పారు. ముస్లిం సమాజంలో కొందరు సంఘ వ్యతిరేక వ్యక్తులు ఉండవచ్చు, చెడు అంశాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని అన్నారు. దానితో మాకు ఎలాంటి సమస్య లేదు. కానీ మదర్సాలో బుల్‌డోజర్‌ను వాడడాన్ని అంగీకరించలేమని అజ్మల్‌ అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ముస్లింలను “టార్గెట్” చేస్తున్నాయని కూడా అజ్మల్ ఆరోపించారు.

అజ్మల్‌ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి రూపమ్ గోస్వామి స్పందించారు. ఉగ్రవాద కార్యకలాపాలపై నిర్దిష్ట ఇన్‌పుట్‌ల ఆధారంగానే మదర్సాలపై కూల్చివేత చర్యలు తీసుకున్నట్లు బీజేపీ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట ఇన్‌పుట్‌ల ఆధారంగా కొన్ని మదర్సాలపై చర్యలు తీసుకుంటోంది, వాటికి సంబంధించిన , జిహాదీ లింక్‌లు కలిగి ఉన్నట్లు భావిస్తున్న వ్యక్తుల అరెస్టులను కూడా అనుసరిస్తోంది. దానికి అజ్మల్ ఎందుకు అంత బాధపడ్డాడో నాకు ఆశ్చర్యంగా ఉంది. అతను అలాంటి జిహాదీ కార్యకలాపాలకు మద్దతిస్తాడా, అలా చేస్తే, ప్రభుత్వం అతనిపై కూడా చర్య తీసుకుంటుందని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రూపమ్ గోస్వామి అన్నారు.

మదర్సా కూల్చివేత తర్వాత అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ విలేకర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అసోం జిహాదీ కార్యకలాపాలకు స్థావరంగా మారిందని వ్యాఖ్యానించారు. గత అయిదు నెలల్లో అన్సరుల్‌తో సంబంధమున్న అయిదు స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు చెప్పారు. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు జిహాదీ కార్యక్రమాలతో సంబంధం ఉన్న 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Marriage: నాలుగు పెళ్లిళ్లు.. ఏడుగురు పిల్లలు.. ఐదో పెళ్లిలో ట్విస్ట్‌..!



from NTV Telugu https://ift.tt/tl7vNFM

Baca juga

Post a Comment