Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Today Events January 15, 2023

* తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు.. కోడిపందాలతో గోదావరి జిల్లాల్లో సందడే సందడి

*నేడు శ్రీశైలంలో నాలుగవరోజు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు..సంక్రాంతి సందర్భంగా శ్రీస్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం

*నేడుమహానందిలో శ్రీకామేశ్వరి మహానందీశ్వరస్వామి వార్లకు విశేష అభిషేకార్చనలు, ఉత్సవమూర్తులకు తిరుమంజన సేవలు, శ్రీదేవి, భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం

*గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న సంక్రాంతి సంబరాలు

*నేడు తిరుపతి నాగళ్లమ్మ ఆలయంలో రావిచెట్టుకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేష్‌ సతీమణి బ్రాహ్మణి ప్రత్యేక పూజలు…మాజీ సీఎం చంద్రబాబు తల్లిదండ్రులు అమ్మన్నమ్మ, ఖర్జూర నాయుడు ఘాట్ దగ్గర ప్రత్యేక పూజలు

* గోదావరి జిల్లాల్లో ఇవాళ రెండవ రోజు కోడిపందాల నిర్వహణ.. భారీగా బరులు ఏర్పాటుచేసిన నిర్వాహకులు

*తిరుమలలో ముగిసిన ధనుర్మాసం.. ఇవాళ్టి నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పున:రుద్దరణ.. గత నెల రోజులుగా స్వామివారికి సుప్రభాతంకు బదులుగా తిరుప్పావైతో మేల్కోలుపు పలికిన అర్చకులు

* నారావారిపల్లెలో కొనసాగుతున్న సంక్రాంతి సందడి… మాజీ సీఎంను కలవడానికి భారీగా తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు

* నేడు అనపర్తి గ్రామ దేవత వీరుళ్లమ్మ అమ్మవారి జాతర..5 రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి భారీగా ఏర్పాట్లు..అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు



from NTV Telugu https://ift.tt/u5Pagmz

Baca juga

Post a Comment