BRS Aurangabad Meeting: అన్నదాతల అభివృద్ధే లక్ష్యం.. ఔరంగబాద్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

BRS Aurangabad Meeting: అన్నదాతల అభివృద్ధే లక్ష్యం.. ఔరంగబాద్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..
Brs Kcr

బీఆర్ఎస్‌ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన కేసీఆర్.. తొలుత మహారాష్ట్రపై సీరియస్‌గా ఫోకస్‌ పెట్టారు. ఆ రాష్ట్రంలో పట్టు సాధించేందుకు పావులు కదువుతున్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో గులాబీ జెండా ఎగరేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. అబ్‌ కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌ నినాదంతో ఇప్పటికే మహారాష్ట్రలో అడుగు పెట్టిన భారత రాష్ట్ర సమితి.. మ‌రాఠ గ‌డ్డపై మూడో బహిరంగసభను సక్సెస్‌ చేసింది.

అధికారంలోకి వస్తే ఇంటింటికీ తాగునీరు..

మ‌హారాష్ట్రలో బీఆర్ఎస్ అధికారంలోకి వ‌స్తే ఐదేళ్లలోనే ఇంటింటికీ సుర‌క్షిత తాగునీరు అందిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. మహారాష్ట్రలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో బీఆర్ఎస్‌ను గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లలో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తే.. ప్రజల సమస్యలు తీర్చే బాధ్యత తాను తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇచ్చారు.

దళిత బంధు, రైతుబంధు, రైతు బీమా అమలుకు డిమాండ్‌..

మరాఠా గడ్డపై మూడో సభగా.. ఔరంగబాద్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్.. కేంద్రంపై మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో దళిత బంధు, రైతుబంధు అమలు చేస్తే, రైతు బీమా కల్పిస్తే, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తే తాను మహారాష్ట్రకు రానని చెప్పుకొచ్చారు. రైతుల పరివర్తనే ముఖ్యమంటూ పునరుద్ఘాటించారు.

రైతు సంఘాల నాయకులు వ్యవసాయ రంగానికి మార్గనిర్దేశం చేసి ముందుండి నడిపించాలని కోరారు. పాలక శక్తులు రైతుల ప్రయోజనాల పేరు చెబుతూ అంతర్జాతీయ, కార్పొరేట్ ఒత్తిళ్లకు లొంగిపోయాయంటూ విమర్శించారు.

అబ్‌ కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌ నినాదంతో ఇప్పటికే మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టిస్తున్న భారత రాష్ట్ర సమితి.. మూడో బహిరంగసభను సక్సెస్‌ చేసింది. పార్టీలో పలువురు చేరగా.. గులాబీ కండువాలు కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు కేసీఆర్‌. మాజీ ఎమ్మెల్యే అభయ్‌ పాటిల్‌తో పాటు ఆయన అనుచరులు పార్టీలో చేరారు.

దేశంలో మార్పు తెచ్చేందుకే బీఆర్ఎస్ పుట్టిందని.. అందుకోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని కేసీఆర్ తెలిపారు. మ‌హారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. అయితే.. అది కిరాయి ఆఫీసు కాదని.. సొంతంగా కార్యాలయాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/hYmuWq2

Baca juga

Post a Comment