Horoscope Today: ఈ రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు.. ఆకస్మిక ప్రయాణాలు

Horoscope Today

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. తమ తమ రోజువారీ రాశి ఫలాలను బట్టి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది ఉంటారు. ఏ పనులు చేపడితే ఎలాంటి లాభాలు ఉంటాయి. రోజులో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. జూలై 16 (శనివారం) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  1. మేష రాశి: వృత్తి, ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అధికారుల నుంచి సహకారం అందుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలలో రాణిస్తారు.
  2. వృషభ రాశి: వ్యాపారస్తులు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. బంధుమిత్రుల సహకారం అందుకుంటారు.
  3. మిథున రాశి: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఒత్తిడి నుంచి బయటపడతారు. కొంత కాలం నుంచి ఇబ్బంది పడుతున్న ఓ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
  4. కర్కాటక రాశి: శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు.
  5. సింహ రాశి: వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి. ఒత్తిడిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. గిట్టనివారితో దూరంగా ఉండటం మంచిది.
  6. కన్య రాశి: చేపట్టే పనుల్లో పట్టుదల అవసరం. కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశాలున్నాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి.
  7. తుల రాశి: వృత్తి, ఉద్యోగ రంగాలలో మంచి ఫలితాలు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. ఆర్థికంగా పుంజుకుంటారు.
  8. వృశ్చిక రాశి: కీలక విషయాలలో కుటుంబ సభ్యులతో చర్చించడం ఎంతో మంచిది. పెండింగ్‌లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు జరుగుతాయి.
  9. ధనుస్సు రాశి: తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురు కాకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. ముఖ్యమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.
  10. మకర రాశి: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. ఓ వార్త మిమ్మల్ని ఆనందాన్ని నింపుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
  11. కుంభ రాశి: ముఖ్యమైన వ్యవహారాలలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. చేపట్టే పనులలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.
  12. మీన రాశి: వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందుకుంటారు. గిట్టని వారిత దూరంగా ఉండటం మంచిది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/Fsh8xW7

Baca juga

Post a Comment