CRIS Recruitment:సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.? నేడే చివరి తేదీ..

Cris Jobs

CRIS Recruitment: సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌(CRIS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, స్టాటిస్టిక్స్‌ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు నేటితో (మంగళవారం) గడువు ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫషికేషన్‌లో భాగంగా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అసిస్టెంట్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు (144), అసిస్టెంట్‌ డేటా అనలిస్ట్‌లు (06) ఖాళీలు ఉన్నాయి.

* కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, స్టాటిస్టిక్స్‌ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తుచేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్‌ పూర్తి చేయడంతో పాటు వ్యాలిడ్‌ గేట్‌ స్కోర్‌ ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను గేట్‌-2022 మెరిట్ స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ నేటితో (24-05-2022) ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..



from TV9 Telugu- Telugu News, Telugu Samachar https://ift.tt/qyMed7I

Baca juga

Post a Comment