Hyper Aadi: మెగాస్టార్ వెంట్రుక కూడా పీకలేరు.. వారికి ఆది వార్నింగ్

Aadhi
Aadhi

Hyper Aadi: జబర్దస్త్ నుంచి వచ్చిన హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఆది కామెడీ గురించి పక్కన పెడితే.. ఆది.. మెగా ఫ్యామిలీకి ఎంత పెద్ద ఫ్యాన్ నో అందరికి తెల్సిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ఆది భక్తుడు అని తెల్సిందే. ఆయనతో పాటే జనసేన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని ఆయన గురించి ఒక అభిమాని కాలర్ ఎత్తుకొని తిరిగేలా మాట్లాడతాడు. ఇక తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వవేడుకల్లో ఆది పాల్గొని పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చాడు. మెగా హీరోల గురించి మాట్లాడి స్టేజిని షేక్ చేశాడు. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి విమర్శించేవారికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడు.

” ముందుగా రామ్ చరణ్ కు హ్యాపీ బర్త్ డే. పదిమంది ఒకరికి దండం పెడితే అది మెగాస్టార్.. అదే పదిమందికి ఒకరు అన్నం పెడితే పవర్ స్టార్. ఈ రెండు లక్షణాలు ఉన్నవాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మధ్యనే ఒక ఇంటర్ కుర్రాడు మెగాస్టార్ కు ఉన్న ఫ్యాన్స్ ఎంతమంది అన్నా అని నన్ను అడిగాడు. 80, 90ల్లో పుట్టిన పదిమంది దగ్గరకు వెళ్లి వారి చేయి చూడు.. వారిలో ఒక్కరికైనా ఆయన పేరు కానీ, ఆయన ముఖం కానీ పచ్చబొట్టు ఉంటుంది. అది ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పా. హీరోలు రావచ్చు..కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేయవచ్చు.. కానీ, ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే రికార్డులు పుట్టిందే ఆయన దగ్గరనుంచి. మొన్న వాడెవడో ఆచార్య సినిమా చూసి.. రిజల్ట్ కొంచెం అటుఇటు అయితే మెగాస్టార్ పని అయిపోయింది అన్నాడు. కానీ, ఆ తరువాత వాల్తేరు వీరయ్యతో రికార్డులు కొల్లగొట్టి ఒక్కసారి నంబర్ వన్ అయితే.. ఎప్పుడు నంబర్ వనే అని ప్రూవ్ చేసిన స్టార్ .. మెగాస్టార్. చేతికి రాత, నోటికి మాట వచ్చిన ప్రతి ఒక్కడు చిరంజీవిని విమర్శించినవాడే. మీ విమర్శలకు చిరంజీవి గారి మీద ఉన్న వెంట్రుక కూడా కదలదు” అని చెప్పుకొచ్చాడు.

ఇక పవన్ కళ్యాణ్ గురించి ఆది మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ జనాభా లెక్కల్లో ఒక్కడు కాదు.. లెక్కలేనంత మంది జనాభాకు ఒక్కడు. నోటుకు ప్రమేయం లేని ఓటును, పదవికి ప్రలోభాన్ని లేని రాజకీయాన్ని నడుపుతున్న, నడుస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్. ప్రతి పనిలో నిజాయితీ ఉన్న ఏకైక స్టార్ పవర్ స్టార్. రైతులకు, పేదలకు, విద్యార్థులకు తన సొంత డబ్బును పంచుతున్నాడు. కష్టాన్ని ముందుగానే ఆలోచించి సాయం చేయగల వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి హీరోకు.. ఆయన అభిమానులే కాదు.. ప్రతి ఒక్క హీరో అభిమానులు సపోర్ట్ చేయాలి ఈసారి. ఇక చరణ్.. తండ్రి పేరును నిలబెడతాడా..? బాబాయ్ పేరును నిలబెడతాడా..? అంటే.. నా దేశం పరువు మొత్తాన్ని నిలబెట్టడానికి పుట్టిన వ్యక్తి మెగా పవర్ స్టార్. ఇండస్ట్రీలో ఎంతమంది మధ్యలో పడేసిన.. నెట్టుకుంటూ వచ్చి మొదటిస్థానంలో నిలబడగల సత్తా ఉన్న స్టార్ .. ఆయన లోకల్ కాదు గ్లోబల్. ఇకనుంచి చరణ్ బర్త్ డే వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతాయి అంటూ చెప్పుకొచ్చాడు.



from NTV Telugu https://ift.tt/P1U5aIM

Baca juga

Post a Comment