Pawan Kalyan: ఇంతకు పవన్ కళ్యాణ్ సినిమాలో ఈ అమ్మడు ఉన్నట్టా..? లేనట్టా.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సాలిడ్ కమ్ బ్యాక్ తర్వాత పవన్ అటు సినిమాలతో ఇటు రాజకీయాలతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలతో హిట్స్ అందుకున్నారు పవన్. అలాగే ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నారు. ఈ పీరియాడిక్ డ్రామాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో పవన్ కు జోడీగా అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి సినిమా చేస్తున్నారు పవన్. తమిళ్ లో హిట్ అయిన వినోదయ సిత్తం సినిమా రీమేక్ లో నటిస్తున్నారు.
ఈ రీమేక్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటు హరీష్ శంకర్ డ్లర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు పవర్ స్టార్. ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా కాలం అయ్యింది. ఈ సినిమాలో పవన్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తుందని తెలుస్తోంది.
హరీష్ శంకర్ డైరెక్షన్ లో పూజా డీజే సినిమా చేసింది. ఆ తర్వాత గద్దల కొండ గణేష్ అనే సినిమాలో కనిపించింది. ఇక ఇప్పుడు పవన్ సినిమాలోనూ ఆమె నటిస్తుందని టాక్. అయితే ఈ మధ్య ఆమె ఈ సినిమాలో నటించడం లేదని వార్తలు పుట్టుకొచ్చాయి. వరుసగా పూజా చేస్తోన్న సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్లే ఈ సినిమానుంచి ఆమెను తప్పించారని కూడా టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఆమె ఈ సినిమానుంచి తప్పుకోలేదని ఆమె ఈ సినిమాలో నటిస్తుందని అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ కు తెర పడాలంటే అధికారిక ప్రకటవ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే..
Pooja Hegde
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/pf24zJ5
Related Posts
- Telangana: అయ్యో దేవుడా.. పడి పూజకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురు దుర్మరణం
- UPSC Recruitment 2022: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 160 ఉద్యోగాలు.. ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..
- Itlu Maredumilli Prajaneekam Trailer: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్ చూశారా ?.. ఆద్యంతం ఉత్కంఠభరితంగా..
- Jagadish Reddy: అక్కడి వారిలా తెలంగాణ ప్రజలు మోసపోరు.. ఆ అక్కసుతోనే మోడీ కేసీఆర్పై విషం చిమ్మారు..
- Pineapple Juice: పైనాపిల్ జ్యూస్ వల్ల కలిగే అష్ట ప్రయోజనాలు ఇవే…! అందం, ఆరోగ్యంతో పాటు..
- MMTS: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఇవాళ, రేపు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు..
Post a Comment
Post a Comment