CSK vs MI : ముంబైపై 7 వికెట్ల తేడాతో చెన్నై గెలుపు

Csk
Csk

ముంబైలోని వాంఖడే స్టేడియంలో శనివారం ఐపీఎల్ 2023లో 12వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ 158 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ప్రారంభంలో, ఓపెనర్ ఇషాన్ కిషన్ 21 బంతుల్లో 32 పరుగులు చేయడంతో ముంబయి 157 పరుగలకు పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో టిమ్‌ డేవిడ్‌ 31, ఇషాన్‌ కిషన్‌ 32 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ 32 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో హృతిక్‌ షోకీన్‌ 13 బంతుల్లో మూడు సిక్సర్లతో 18 పరుగులు చేయడంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

Also Read : Shriya Saran: క్లివేజ్ షోతో కాక రేపినా.. థైస్ షోతో దుంప తెచ్చినా నీ తరువాతనే అమ్మడు

కాగా, చెన్నై బౌలర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. కాగా, మిచెల్ సాంట్నర్, తుషార్ దేశ్‌పాండే చెరో రెండేసి వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే 158 లక్ష్య ఛేదనకు దిగిన చైన్నై సూపర్‌ కింగ్స్‌ లో… బ్యాటర్‌ అజింక్యా రహానే విజృంభించాడు. రహానే 27 బంతుల్లోనే 61 పరుగులు సంచలన ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయానికి బాటలు వేశాడు. ఆ తర్వాత రుతురాజ్‌ గైక​ఆవడ్‌(40 నాటౌట్‌), శివమ్‌ దూబే(28), అంబటి రాయుడు(20 నాటౌట్‌) మిగిలిన లక్ష్యాన్ని ఛేదించారు. ముంబై బౌలర్లలో జాసన్‌ బెండార్ఫ్‌, పియూష్‌ చావ్లా, కుమార్‌ కార్తికేయలు తలా ఒక వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.

Also Read : Kishan Reddy : ప్రధాన మంత్రి పర్యటన విజయవంతం అయింది.. ప్రజల్లో మంచి స్పందన వచ్చింది



from NTV Telugu https://ift.tt/pr6SDuQ

Baca juga

Post a Comment