Vaarasudu : తమిళ్ లో హిట్టు కొట్టేసింది మరి తెలుగులో పరిస్థితి ఏంటి.. విజయం సాదించినట్టేనా..?

నిన్న మొన్నటి వరకు పొంగల్ పోరు గురించే తమిళ నాట హాట్ డిస్కషన్. ఏ సినిమా హిట్టవుతుంది? ఏ సినిమా ఫట్టవుతుందన్నదే.. తంబీల థింకింగ్. ఇక ఎన్నో రోజుల వారి థింకింగ్‌కు తాజాగా పులిస్టాప్ పడింది. జాన్ 11న పొంగల్ కానుకగా… విజయ్ వారిసు.. అజిత్ తునివు రిలీజైపోయింది. వేటికవే తమిళ తంబీలను విపరీతంగా ఎంటర్ టైన్ చేశాయి. కాని ఆ తరువాతే వచ్చి పడింది అసలు చిక్కు. దిల్ రాజుపై ఎక్కు పెట్టేలా కామెంటు. ఈ సినిమా ఇక్కడ కష్టమే అనే టాక్ .. ఎస్ ! ఓ పక్క తునివు సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. విజయ్ వారిసు కూడా హిట్టనే టాక్ తెచ్చుకుంది. కాని ఇంతోటి సినిమాకేనా తెలుగు నాట దిల్ రాజు ఇంతగా ఫైట్ చేసింది అనేదే ఇప్పుడు కాంట్రో కామెంట్ గా మారింది.
తెలుగు టీంతో.. ఎక్కువ మంది తెలుగు ఆర్టిస్టులతో.. తమిళ స్టార్ హీరో విజయ్‌తో దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా.. మొదటి నుంచి తెలుగు సినిమానో.. తమిళ సినిమాతో అర్థమయ్యేది కాదు ఫిల్మ్ లవర్స్‌కు. అందులోనూ విజయ్ ఫ్యాన్స్‌కు. ఇక ఇది తమిళ సినిమా అని దిల్ రాజు ఎప్పుడైతే చెప్పారో.. అప్పుడే తమిళ తంబీలు చెప్పారు… పొంగల్‌కు ఈ సినిమా హిట్టని. విజయ్ క్రేజ్‌కు బొమ్మ చిరిగిపోవడం పక్కా అని. అప్పుడే తెలుగు ప్రేక్షకులు కాస్త తికమకలో పడ్డారు.
తెలుగులో అంతగా స్టార్ డమ్ లేని విజయ్.. పాత చింతకాయ పచ్చడిని గుర్తు తెచ్చిన వారిసు ట్రైలర్. అందులోనూ.. టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరు, బాలయ్య సినిమా రిలీజులు. ఇలాంటి వాటి మధ్యలో దిల్ రాజు తన సినిమా రిలీజ్ కోసం చేసిన పోరాటం. ఎన్నో ఉత్కంఠల మధ్య తెలుగులో రిలీజ్ వాయిదా..! ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే తమిళ్ వారిసు రిలీజ్ ను .. అక్కడి టాక్‌ను ఫాలో అయిన తెలుగు ఆడియెన్స్.. నెట్టింట అంటుంది మాత్రం ఓకే మాట..అక్కడే అలా అయితే… ఇక్కడ కష్టమే గా…అని కానీ ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుందని చిత్రయూనిట్ చెప్తోంది. మరి కొన్నిరోజులు అయితే కానీ ఈ సినిమా తెలుగులో హిట్టా ఫట్టా అన్నది తేలిపోతుంది.
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/53gbPjd
Related Posts
- Telangana: మానవత్వానికి ప్రతిరూపం.. తాను మరణిస్తూ.. మరో నలుగురుకి జీవితాన్ని ఇచ్చిన ఖమ్మం మహిళ..
- Horoscope Today: ఆశాజనకంగా ఆ రాశివారి ఆర్థిక పరిస్థితి.. మంగళవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..?
- Sridhar Rao Arrest: సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు చీటింగ్ బాగోతం.. వయా ముంబై, ఢిల్లీకి ఎలా చేరాయంటే?
- Andhra Pradesh: ఏపీ కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?
- Earthquake: ప్రకృతి పగబట్టిందా ఏంటి..? టర్కీని వదలని భూకంపాలు.. 6.4 తీవ్రతతో కుదిపేసిన మరో భూకంపం..
- T20 World Cup: 120 బంతుల్లో రికార్డ్ స్కోర్.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.. తొలి జట్టుగా ఇంగ్లండ్..
Post a Comment
Post a Comment